... కానీ విల్లును ఎవరూ ఎక్కుపెట్టలేకపోయారు. అందరికీ అవమానమే ఎదురయ్యింది. విశ్వామిత్రుని ప్రేరణచే, శ్రీరాముడు విల్లును ఎక్కుపెట్టేందుకు వచ్చాడు.
ధనస్సుని తాకుతున్న రాముని వంక అలవోకగా చూచింది జానకి! నీలి మబ్బులు గుంపుకట్టినట్లున్నాడు. పద్మపత్రాల వంటి కన్నులవాడు. పొడవైన, దృఢమైన చేతులు కలవాడు. క్షత్రియ తేజస్సు రూపం ఎత్తినట్లున్నవాడు. సూర్యుడంత కాంతినీ, చంద్రుడంత ఆహ్లాదాన్నీ విరజిమ్ముతున్నవాడు.III
రామాయణం భారతీయ ఆత్మ-రామాయణం భారత జాతీయత. రామాయణం మహోన్నత భారతీయ సంస్కృతికి పతాక.జ రామాయణ భారత ధార్మిక జీవన విధానానికి ప్రతీక. అందుకే ప్రతి భారతీయుడూ పిల్లలకు చిన్ననాటనే రామాయణం అందించాలి. చిన్ననాటనే గొప్ప వ్యక్తిత్వానికై బీజాలు నాటాలి. చిన్ననాటనే ధార్మికత అందించాలి. దానికి మార్గం కథలే. అందుకు రాచబాట రామాయణం. ఎమెస్కో వారు ఆ రామాయణాన్ని చక్కని బొమ్మలతో అందిస్తున్నారీ పుస్తకంలో.

Write a review

Note: HTML is not translated!
Bad           Good