'భీముడు క్రీడలలో కౌరవులను ఏడిపించేస్తుండేవాడు. కోతి కొమ్మచ్చి ఆటలో బాలురు చెట్టెక్కి ఉండగా అతడు ఆ మానుల దొరకబుచ్చుకొని కాయలతోబాటు బాలురు కూడా కిందపడేటట్లు బలంగా కుదిపేవాడు. తమాషాకి అతడు ఎవని జబ్బపట్టుకులాగినా అది కీలునుండి ఊడి వచ్చేంత పనియై ఆ బాధితుడు మొర్రో అని రోదించేవాడు. భృముడు గజ ఈతగాడు. గంగానదిలో జలక్రీడ సమయమందు పదేసి మంది ధార్తరాష్ట్రులను శిఖలు పట్టుకు ముంచి ఉక్కిరిబిక్కిరి చేసేవాడు'.

తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి - అని సామెత. వ్యాసమహర్షి పద్దెనిమిది పర్వాలతో మహాభారతాన్ని నిర్మించాడు. ఆ తర్వాత అనేక భాషల్లోకి అనువదించబడిన మహాభారతం అందరికీ చవులూరించే కథే. ఇక బాలబాలికలకు ఈ కథ ఎంతో ఇష్టమైనది. అందుకే ఎమెస్కో వారు చక్కని బొమ్మలతో మహాభారతాన్ని క్లుప్తంగా అందిస్తున్నారీ పుస్తకంలో.

Write a review

Note: HTML is not translated!
Bad           Good