'ఓరీ, అతడు అణువు అణువు వ్యాపించి యున్నాడా? మరి నాకు కనిపించడేమి? ఓహో బలవంతులంటే భయమా నీ శ్రీహరికి?'
''కాదు దండ్రీ! నీవు చూడగలవు''
''చూడగలవా! ఎక్కడ? యీ స్ధంబంలో ఉన్నాడా నీ శ్రీహరి?''
''ఉన్నాడు తండ్రీ! శ్రీహరి అందున్నాడు''.
''ఉంటే బైటకు రమ్మను'' అంటూ హిరణ్యకశిపుడు చేతిలోని గదతో ఆ ఉక్కు స్ధంభాన్ని బ్రద్దలు కొట్టాడు. అప్పుడు ప్రహ్లాదుడు 'ఓం నమోనారాయణాయ, దేవదేవ, అజ్ఞాని అయిన నా తండ్రికి దర్శన మివ్వు అని ప్రార్ధించాడు.
ఫెళ ఫెళార్భాటాలు వినిపించాయి.
ఆకాశంలో మేఘాలు గుర్జించాయి.
సప్త సముద్రాలు హోరెత్తాయి.
+++
పురాణాల్లో కెల్లా తియ్యనిది భాగవతం. చిన్న కృష్ణుని అల్లరి కథలు, రాక్షస వధలు, కృష్ణుని లీలలు, గొల్లబాలలు - ఇలా ఎంతో ఆహ్లాదంగా సాగిపోయే కథ. ఈ పురాణతిలకాన్ని చిన్న పిల్లల కోసం క్తుప్తంగా అందిస్తున్నారు ఎమెస్కోవారు. చక్కని ఆకర్షణీయమైన బొమ్మలతో, సరళమైన భాషతో కూడుకున్న పుస్తకం. ఇది పసిహృదయాల్లో శ్రీ కృష్ణుడిని ప్రతిష్టించే పుస్తకం. భారతీయతను తెలియజేసే పుస్తకం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good