గురువులకు గురువు మన గురజాడ అడుగుజాడలో మనం నడవకపోవడంవలెనే ప్రతిరంగంలోనూ పారదర్శకంగా నిష్క్రియాపరత్వం కన్పిస్తోంది.
నూట ముప్ఫై సంవత్సరాల క్రితమే విద్యావిధానం ఎంత విలక్షణంగా, వినూత్నంగా, వైజ్ఞానికంగా ఉండాలో అనేక లేఖలతో తన సాహితీ స్నేహితులకు, మిత్రులకు ముఖ్యంగా తన శిష్యుడు ముని సుబ్రహ్మణ్యంకి రాసాడు. మన సంస్కృతి, మన ఆచార వ్యవహారాలు అని ఘోషిస్తున్న వర్తమాన పండితోత్తములు ఆ మహా జ్ఞాని యొక్క ఆలోచనా స్రవంతిని అర్థం చేసుకోలేక పోవడం వలన విషఫలాల ఫలితం క్షణం క్షణం (ప్రతిక్షణం) అనుభవిస్తున్నాం. ఈ పరిణామ ఫలితమే ఇప్పటి విద్య నేర్పుతున్న గురువులపై పసికూనలపై చూపుతున్న పాశవిక ప్రవర్తన సర్వత్రా కానవస్తోంది....
పేజీలు : 72