ఈసఫ్‌ కథలు (3 భాగాలు) - కె. రామలక్ష్మి
ఈ ఈసప్‌ కథలు నాకు చాలా సరదా. ఎన్నిసార్లైనా చదువుతూ వుంటాను. ఈ కథలు పిల్లలనీ పెద్దలనీ కూడా ఆకట్టుకుంటాయి. ఈ కథలు శాశ్వత సత్యాలని ఎంతో క్లుప్తంగా చెప్పేస్తాయి. అందుకే యీ కథలు పేర్లూ కూడా ప్రపంచ భాషలలో పదబంధాలుగా, సామెతలుగా ఇమిడిపోయాయి. గడ్డివాములో నక్క, అందని ద్రాక్ష పులుపు - గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు. మనకి కూడా సామెతలై కూర్చున్నాయి. మనిషి లక్షణం - తిరిగి చెప్పనక్కరలేని పోలికలైపోయాయి.
ఈ కథలు విననివారూ, చదవనివారూ, చదివి ఆనందించనివారూ అరుదుగా వుంటారు. క్లుప్తత నీతి, హెచ్చరిక, ఎగతాళి - ఎన్నెన్ని విషయాలో ఈ జంతువులు చెప్పక చెప్పడం, కనువిప్పు కల్గించడం - చాలా కుతూహలం కల్గిస్తుంది. మాటలేని రాని జంతువు - ఎంత నీతి చెప్పకలదు? వింత కదూ. సింహం శౌర్యం, చెవులపిల్లి పిరికితనం, నక్క బుద్ధి, గాడిద బుద్ధి తక్కువతనం... అబ్బ అతి సామాన్యమైన జంతువు అతి శక్తివంతమైన జంతువు! అతి సామాన్యమైనవి, అతి బలిష్టమైన నిజాలూ, నీతులూ! నిజానికి చిట్టెలుక ఎంతది? అది సింహాన్ని ఎదిరించలేదు. కాని దాన్ని బంధించిన - తాళ్లు సునాయాసంగా కొరికి దానికి స్వేచ్ఛని ప్రసాదించకలదు! దాని స్నేహం సంపాదించకలదు! అతి గర్వం, పొగరు వీటికి పతనం తప్పదు!... ఇంత క్లుప్తంగా సూటిగా ఈ విషయాలు ఎవరూ చెప్పలేరు ఒక్క ఈసప్‌ తప్పించి, కథలు రకరకాలుగా వుండొచ్చు కాని అవి చెప్పే నీతి ఒకటే... అదొక్కటే ముఖ్యం కదూ!... ఈ కథలని నేను నా మనవలకి - చెప్పలేకపోయాను. వారికి తెలుగు చదవను, వ్రాయను రాకపోవడం దురదృష్టం. కాని వారి తల్లులు - ఈ కథలు వారికి చదివి వినిపించాలని నా కోరిక. కథ చదవడంలో దాని అర్థం కూడా బోధపడుతుంది. చదివే శైలి, సంభాషణలు, సంభాషణల్లా చదవడం, పిల్లలని ఆకట్టుకోగల్గడం తల్లులకి చాలా ముఖ్యం. ఇప్పటికీ ''పేనుకేంటి'' పెసరచేనేంది? గడపకేసి కుక్కండెహెస్‌' అన్న రాజుగారి మదం తల్చుకుని నా పిల్లల పెదవులపై చిరునవ్వు లీలగా కన్పిస్తుంది! ఆ ఆనందం, వూహలకి రెక్కలూ వారు వారి పిల్లలకి కూడా పంచాలని నా కోరిక. అందుకే ఈ కథలు నా మనవల కోసం రాశాను. తల్లులు చదవాలి..

Write a review

Note: HTML is not translated!
Bad           Good