Rs.70.00
In Stock
-
+
ఇన్నాళ్ళు ఈ జీవితం నాది అనుకున్నాను. కానీ అది తప్పు, యీ జీవితం నా ఒక్కరిదే కాదు, నా చుట్టూ వున్నవారిది కూడా!
ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా యీ జీవితం నాది అనుకుంటే ఆ వ్యక్తి స్వార్థపరులే అయివుండాలి. లేకపోతే అమాయకులైనా, మూర్ఖులైనా అయివుండాలి.
''ఈ జీవితం నాది'' అనుకుని శ్రమించి, నా ఒక్కరిదే కానట్టు చుట్టూ వున్నవారితో పంచుకోవాలి.
ఏ మనిషి ఒంటిరిగా తోడు లేకుండా బ్రతకలేరు.
ప్రియా, నువ్వు అది తెలుసుకున్నావు కాబట్టి ఆనందంగా, సుఖంగా వుండగలుగుతున్నావు.
నేనది గ్రహించక భగవంతుడిచ్చిన జన్మకు విలువ తెలియక జీవితాన్ని నేలరాచుకున్నాను అంటుంది మదుర.
ఆడపిల్లల జీవితాలు ఎక్కడ మలుపు తిరుగుతాయో, అక్కడ వుండవలసిన జాగ్రత్త లేకపోతే జీవితం ఎలా పతనమవుతుందో తెలియచెప్పిన నవల.
పేజీలు : 188