ప్రభు సబ్‌ఇన్‌స్పెక్టర్‌, బిందు అతని భార్య, రచయిత్రి. వారికి నలుగురు పిల్లలు. విధి నిర్వహణలో అనికాతనే సాటి. తన పర భేదం లేదు. ఎవరు చెప్పినా వినడు. వేటికీ లొంగడు. యిలాంటి వారివల్లనే ప్రభుత్వ యంత్రాంగానికి తుష్టి పుష్టి వచ్చేది. న్యాయం, ధర్మం సక్రమంగా పాలింపబేది. అయితే ఒక్కోసారి తన ధర్మమే తన న్యాయమే ఆ ఉద్యోగికి, అతని కుటుంబానికి ప్రాణాంతకమైతుంది. చట్టాలు, న్యాయస్థానాలు అతనిని రక్షించలేవు. అతని సేవకు గుర్తింపేమిఇ? ఏ దేశ సౌభాగ్యం కోసం అతను అహరహం శ్రమించాడో ఆ దేశం వారికేమిచ్చింది?
నిశిత సూక్ష్మ పరిశీలనలో తనకుతానే సాటియైన శ్రీమతి సులోచకనా రాణిగారి మరో ప్రయజనాత్మక, ప్రయోగాత్మక నవల.
మనోహరమైన ఆమె శైలి నందనవనంలో విహరిస్తున్నట్లు కమనీయమైన సంగీతం వింటున్నట్లు, వేదనాభరిత హృదయాలకు స్వాంతన వచనాలు పలుకుతున్నట్లు వుంటుంది. ఈ ఏటి నవలలో దీనికి సాటి, పోటీ లేదు అని ఇప్పటికే వేలాది పాఠకులు మెచ్చిన నవల.

Write a review

Note: HTML is not translated!
Bad           Good