సంఘసంస్కర్త వీరేశలింగంగారి గురించి అనేక వ్యాస సంపుటులు వచ్చాయి. సిద్ధాంత గ్రంథాలు వచ్చాయి. ఎన్ని వచ్చినా వీరేశలింగంగారి దృక్పథముగాని, ఆచరణ సిద్ధాంతాలుగాని నేటి మానవునికి స్పృహలోకి కూడా రావడం లేదనేది సత్యం. ఏటికెదురీది అనేక రంగాలలో సంస్కరణలు చేసిన మాన్యుడు మరొకడు లేడనేది నా యోజన. సంస్కరణలో, సంస్కృతిలో, సాహిత్యంలో, భాషలో అనేక మార్పులు తీసుకువచ్చారాయన. వాటన్నిటినీ ప్రక్కకుబెట్టి సంపాదించిన ఆస్తులే కాదు, తాతలనాటి ఆస్తులను కూడ తాను ఏర్పరిచన సంస్థలలో కనీసం సభ్యత్వంకూడ నిలుపుకోని త్యాగశీలి. అంతేకాదు తన ఏర్పరిచిన ట్రస్ట్‌నుండి డబ్బు అప్పుగా తీసుకోలేని దుస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది.

కోటానుకోట్లు అక్రమార్జనలను చేస్తున్న నేటి బడా బాబులకు వీరేశలింగంగారి గురించి కనీస అవగాహనకూడా లేకపోవడం దురదృష్టకరం. తాను ఏర్పరచిన ట్రస్ట్‌లలో అన్ని కులాలవారికి, అన్ని వర్గాలవారికి చోటు కల్పించారు. నేటి సామాజిక సంఘాలలో ప్రస్తుతం పేరు మాత్రమే అన్ని వర్గాలువారు సభ్యులు. ఎవరికుంపటి వారిదే. 'మనోడు' అనే పదం ఉంటే చాలు చాలా పనులు చక్కబెట్టుకోవచ్చు. అన్ని పనులు సమకూరుతాయి.

ఇక - వీరేశలింగంగారి 'ఎదురీత' పుస్తకంగురించి వస్తే - మూఢ నమ్కఆలను నిరసించడం, వితంతు వివాహాలు చేయడం, వివేకవర్థనిలో లంచగొడులు గురించి వ్రాయడం, తెలుగులో నూతన ప్రక్రియలు ప్రారంభించడం - వీటన్నిటినీ కందుకూరి వీరేశలింగం పంతులుగారు చేసారు. ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించుకోవలసింది భార్య రాజ్యక్ష్మమ్మగారు అండదండలివ్వడమే కారణం. వీరేశలింగం చేసిన ఉద్యమాలో సగభాగం ఆమెకే చెందుతాయి. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు. వీరేశలింగంగారే తన స్వీయ చరిత్రలో చెప్పుకున్నారు. ఈ పుస్తకంలో వాటి వివరాలన్నీ చోటుచేసుకున్నాయి. వాటి గురించి విద్యార్థులకు కొంతైనా అవగాహన కల్పించగలమేమో యోచించండి. - అరిపిరాల

Pages : 128

Write a review

Note: HTML is not translated!
Bad           Good