అనురాధ తమ బ్యారెక్కులో ఉన్న మహిళల గురించి, అందులో కొంత మంది గురించే, తన శక్తి మేరకు రాశారు. ఈ మహిళా ఖైదీల్లో ఆదివాసులు, పట్టణవాసులు, పైవర్గం మహిళలు - అక్రమ కేసుల మీద అరెస్టయి శిక్షలు పడినవాళ్లు, విచారణలో ఉన్నవాళ్లు, ఏం కేసులో ఇదమిద్ధంగా తెలియనివాళ్లు, ఏ నేరం చేయకుండా తల్లులతో పాటు విధి లేక జైలుకు వచ్చిన ఇరవై అయిదు మంది పిల్లలు, రాజకీయ ఖైదీలు (మావోయిస్టులు) ఉన్నారు. వీళ్లంతా రక్త మాంసాలున్న మనుషులు. ముసుగులన్నీ తొలిగిపోయి జీవితపు నగ్న భయంకర స్వరూపాన్ని అనుభవిస్తున్నవాళ్లు. తమ గురించి తమ చుట్టూ ఉన్నవాళ్ల గురించి - ధూర్త, దుష్ట ప్రపంచం గురించి ఎరుక కల్గిన వాళ్లు... అయితే ఎంత దుర్భరమైన బతుకులో కూడా - బందీకానాలో కూడా - బతుకు మీద ఆశ చావని వాళ్లు - ఊపిరున్నంత వరకు పోరాడే వాల్లు - ఊపిరున్నంత వరకు పోరాడే వాళ్లు... ముందుగు సాగేవాళ్లు.

దోస్తయెవ్‌స్కీ ప్రసిద్ధ నవల 'నేరము - శిక్ష'లో నేరపూరితమైన దోపిడీ వ్యవస్థ సకల సంపదల సృష్టికర్తలైన ప్రజలను నేరస్తులుగా మార్చి సంపదల సృష్టికర్తలైన ప్రజలను నేరస్తులుగా మార్చి శిక్షించే కిరాతకాన్ని రాశారు. ఇందులో ఒక్కొక్క కథ అలాంటి కిరాతకాన్ని బట్టబయలు చేస్తుంది.

- అల్లం రాజయ్య

Pages : 141

Write a review

Note: HTML is not translated!
Bad           Good