బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయల డబ్బుంది. రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు రెడీగానే ఉన్నారు. కానీ వాటిని ఎలా పొందాలో చాలా మందికి తెలియదు. బ్యాంకుల్లో ఎవరెవరికి రుణాలిస్తారు? ఎంత కాలానికి ఇస్తారు? వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి? ఋనం తీసుకోవాలంటే డాక్యుమెంట్లు ఏమేం ఉండాలి? ఇలా అనేక ప్రశ్నలకు అందరికీ అర్థమయ్యే రీతిలో తెలుగులో రూపొందిన మొట్టమొదటి పుస్తకం ఇది.

పర్సనల్‌ లోన్‌, బిజినెస్‌ లోన్‌, కార్‌ లోన్‌, బైక్‌ లోన్‌, గోల్డ్‌ లోన్‌, హౌజింగ్‌ లోన్‌, క్రెడిట్‌ కార్డు... ఇలా అన్ని రకాల రుణాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ పుస్తకంలో రాయబడింది. సిబిల్‌ (క్రెడిట్‌ స్కోర్‌) ప్రాబ్లమ్స్‌ ఎలా వస్తాయి? ఎలా సాల్వ్‌ చేసుకోవాలి? స్కోర్‌ ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను నిపుణుల సహాయంతో పొందుపరిచాము.

స్టార్ట్‌ అప్‌ కంపెనీలకు ఫండింగ్‌ ఎవరిస్తారు? ఎలా వస్తుంది? ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం ఉంటుంది? రుణాలిచ్చే బ్యాంకులు ఏవి? బ్రాహ్మణ, కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా కార్పోరేషన్‌ రుణాలు ఎక్కడి నుంచి పొందొచ్చు? సబ్సిడీ ఎంత ఉంటుంది? ఒక్కటేమిటి ఈ పుస్తకంలో రుణాలకు సంబంధించిన అనేక విషయాలు చర్చించబడ్డాయి. పరిష్కారాలు సూచించబడ్డాయి.

పేజీలు : 120

Write a review

Note: HTML is not translated!
Bad           Good