మల్లిఖార్జున జ్యోతిర్లింగము
విజయవాడ నుండిగాని, హైదరాబాదు నుండి గాని బయలుదేరినపుడు ప్రథమముగా శ్రీశైల మహాక్షేత్రము దర్శించుకొనుట ముఖ్యము. ఈ క్షేత్రమునకు ఆంధ్రప్రదేశములో అన్ని ప్రదేశములనుండి బస్సులు గలవు. కనుక ఈ క్షేత్రమునకు కారు మీదగాని బస్సు మీదగాని ప్రయాణించవచ్చును. రైలు మీద అయినచో మార్కాపురము వరకు రైలు మీద వచ్చి అచ్చటి నుండి బస్సులో ప్రయాణించవచ్చును.
ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో నల్లమల పర్వతశ్రేణులలో సముద్ర మట్టానికి షుమారు 460 మీటర్ల ఎత్తులో వేంచేసి యున్న క్షేత్రము శ్రీశైల క్షేత్రము. ఈ క్షేత్రమును గూర్చి స్కాందపురాణములో ప్రస్తావించబడినది. ఈ క్షేత్రానికి నాల్గు ద్వారములున్నవి. తూర్పున త్రిపురాంతకము, వినుకొండ-దోర్నాల మధ్యన వున్నది. దక్షిణమున సిద్ధపటము (కడప దగ్గర) పడమర అలంపురము (కర్నూలు హైదరాబాదు రూటులో షుమారు 15 లేదా 20 కిలోమీటర్లు వద్ద తూర్పునరకు వెళ్లవలయును. అచ్చట అలంపురము అని బోర్డు వుండును లేదా ఎవరినైనా అడిగినచో చెప్పెదరు). ఉత్తరమున ఉమామహేశ్కవరము (హైదరాబాదు నుండి శ్రీశైలము వచ్చుదారిలో అచ్చంపేటకు దగ్గరగా వున్నది.) పూర్వ భక్తులు ఈ నాల్గు ద్వారక్షేత్రాలలో ఏదైనా క్షేత్రము ద్వారా శ్రీశైల క్షేత్రానికి శ్రీశ్రీశ్రీ మల్లిఖార్జున శ్రీశ్రీశ్రీ భ్రమరాంబాదేవేరుల దర్శనమై వేంచేయుచుండెడివారు....
Pages : 64