'మీరందరూ ఒప్పుకుంటే నేనో కొత్త రకం పందెం సూచిస్తాను'' అన్నాడు విజ్జీ.

''ఏమిటి?''

''అయిదుగురం అయిదు కథలు చెప్పుకుందాం. ఎవరిది తక్కువ సస్పెన్సుతో వుంటే వారు ఈ రాత్రి ఈ బిల్లు ఇవ్వాలి'' అన్నాడు.

అంతా ఓకే చెప్పారు. వెయిటరు. బీరు బాటిల్సూ చికెన్‌ మంచూరియా తీసుకొచ్చి బల్లమీద సర్దాడు. మొట్టమొదటి కథ శివ చెప్పటం మొదలు పెట్టాడు. అది 'దుప్పట్లో మిన్నాగు'. ఆ తర్వాతిది విజ్జి కథ; ఓడ ప్రయాణం, వెంకు చెప్పింది 'మానవాతీత వ్యక్తి' కథ. ఇక 'వరండా కుర్రాడు' శేషు చెప్పిన కథ. చివరిది 'అంతర్నేత్రం'. నరాలను తెంపేసే సస్పెన్సు, నమ్మక తప్పని కథనమూ గగుర్పొపడిచే సంఘటనలూ కొనమెరుపులూ వెరసి 'దుప్పట్లో మిన్నాగు'.

ఒకటి హాస్యం, ఒకటి వ్యంగ్యం, ఒకటి శృంగారం, ఒకటి బీభత్సం, ఒకటి అద్భుతం, ఒకటి భయానకం - అన్నీ కలిపి చివరన ఒక ట్విస్టు - అది ఆశ్చర్యం. అంతర్లీనంగా ఆరు విభిన్న రసాల కథా వేదిక - 'దుప్పట్లో మిన్నాగు'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good