హిందూమతంలో వేళ్లూనుకున్న అంటరానితనాన్ని బరించలేక దళిత కులస్థులు కొంతమంది బాబా ఫక్రుద్దీన్‌ బోధనలకు ప్రబావితులై ఇస్లాం మతాన్ని స్వీకరించారు. మతం మారినా ఉర్దూ మాట్లాడటం రాదనో, దేవుళ్ల పటాలను పూజిస్తారనో, హిందూ ఆచారాన్ని పాటిస్తారనో కారణాలు చూపి సోదర ముస్లింలు వాళ్లని లద్దాప్‌లనీ, పింజారీలనీ అవమానిస్తున్నారు. ఆధా ముసల్మానులని కించపరుస్తున్నారు. వాళ్లతో పెళ్ళి సంబంధాలు కలుపుకోరు. వాళ్లని తమ ఇళ్ళల్లో జరిగే శుభకార్యాలకు పిలవరు.

అల్లా దృష్టిలో అందరూ సమానమేనని, ముస్లింలలో కులవ్యవస్థ లేదని ఇస్లాం మౌలిక సూత్రాలు చెప్తున్నా దూదేకుల్ని పరాయివాళ్లుగా, నిమ్న కులస్థులుగానే చూస్తారు. ఇస్లాం మతం స్వీకరించినా తమది ప్రత్యేక కులమన్న అవగాహనతో ప్రభుత్వంతో పోరాడి రిజర్వేషన్‌ సౌకర్యాన్ని దూదేకులు సాధించుకున్నారు. తమను దూదేకులు అనకుండా నూర్‌బాషీయులని గౌరవంగా పిలవాలని తీర్మానించారు.

ఈ నేపథ్యంలో విద్యాధికుడైన దూదేకుల యువకుడు రెహమాన్‌ ఇస్లాం మతాచారాల్ని ఖచ్చితంగా పాటించే ముస్లిం యువతి నూర్జహాన్ని నిఖా చేసుకోవడం వల్ల ఎదుర్కొన్న కష్టనష్టాల్ని అక్షరీకరించిన నవల ''దూదిపింజలు''. ముస్లిం సమాజంలో చాపకింద నీరులా విస్తరించిన కులవ్యవస్థ వీళ్ల జీవితాలతో ఆడుకున్న వైనాన్ని చిత్రించిన నవల ''దూదిపింజలు''.

పేజీలు : 183

Write a review

Note: HTML is not translated!
Bad           Good