నిరుపేద కుటుంబంలో పుట్టి, ప్రతిభా పాటవాన్ని విద్యా రంగంలో ప్రదర్మించి, ఉపాధ్యాయుడై, మహోపాధ్యాయుడై , ఆదర్శ గురువర్యుడై, ప్రాక్పశ్చిమ తత్వశాస్త్రాలను ఆపోసనపట్టి , దేశ విదేశాలలో లేడురా ఇట్టి ఘనుడైన మానవుడు అనిపించుకొని భారతదేశంలోని ఎన్నో విశ్వ విద్యాలయాలను జీవం పోసి, సోవియట్ రష్యాకు రాయబారిగా ,ఆక్సుఫర్డు విశ్వవిద్యాలయ తత్వశాస్త్ర సందర్శక ఆచార్యునిగా, ఉపరాష్ట్రపతిగా, భారతదేశపు రెండోవ రాష్త్ర పతిగా , భారత రత్నగా వెలిగిన డాక్టర్ సర్వేపల్లి రాదా కృష్ణన్ మహామోహో పాద్యాయునిగా ఎదిగిన పూర్ణ పురుషుడు. రాధాకృష్ణన్ జీవితంలోని వివిధ ఘట్టాలను, అయన లో వికసించిన అద్భుత మేధాశక్తి ణి, ఆయన వ్యక్తిత్వం క్రమోన్మీలనం పొందిన రీతిని, విశ్వమానవునిగా ఆయన చెందిన పరిణితికి నిదర్శనంగా ఉత్తేజితమైన శైలి లో కిషోర ప్రాయం లోని బిడ్డలను ఉన్నత పధాల వైపు ప్రోత్సాహితులను చేస్తూ కావించిన రచన. |