భారతీయులందరూ హిందీని నేర్చుకోన్నచో దేశంలోని అధిక సంఖ్యాకులతో సంబందాలు ఏర్పరచుకోవటం సులభం అవుతుంది. హిందీ తెలిసిన వ్యక్తీ వ్యాపార సంబంధాలు పెంచుకోగలడు.రాజకీయాలలో రాణించా గలదు. జాతీయ సమైక్యతను కృషి సలుప గలదు. ప్రతి వ్యక్తికీ కావ్యాల్లోనూ, నవలలలోనూ వాడబడే క్లిష్టమైన ,అలంకారములతో కూడిన హిందీ భాషనూ నేర్చుకోవాలసిన అవసరం లేదు.  దైనందిక జీవితంలో వాడే శబ్దాలు , వాటిని ఉపయోగించే విధానం తెలుసుకొంటే చాలు, వ్యావహారిక భాషకు కుడా వ్యాకరణం వుంటుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే ఈ పుస్తకం రూపొందించ బడింది.హిందీని హిందీ ద్వారా నేర్చుకోవటం కన్నా మన మాతృభాషలో ప్రాంతీయ భాషయైన తెలుగు ద్వారా నేర్చుకోవడం సులభం, కనుక ఈ పుస్తంలో తెలుగు లో హిందీ పాటాలు పొందుపరచ బడినవి. .వర్ణమాల, గుణింతం తో ప్రారంభం చేసి చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న వాక్యాలు ఇవ్వబడ్డాయి. సంభాషణలు, కధలు, ఉత్తరాలు కూడా చేర్చబడినవి. ప్రతి పాఠంలోను అవసరమైన చోట కొన్ని క్రోత్త  శబ్దాలు , కొన్ని క్రోత్త  వ్యాకరణంశ్యాలు  సులభమైన భాషలో వివరింపబడినవి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good