Rs.100.00
In Stock
-
+
చరిత్రను నిర్వికారంగా అధ్యయనం చేయాలి,
అందులో కలిసిపోవాలని తపించిపోతూ
దాన్ని వక్రీకరించటానికి ప్రయత్నించకూడదు.
మరీ ముఖ్యంగా...
చరిత్రను మరిచిపోరాదు.
'మంచిగతమున కొంచెమేనోయ్
మందగించక ముందుకడుగెయ్....' అని నిబ్బరంగా చెప్పాడు గురజాడ.
ఇంత చారిత్రక దృష్టి కలిగిన కవిగానీ, రచయితగానీ అంతకుముందు వేమన తప్ప మరొకడు లేడు. ఆ తరువాత వారిలో శ్రీశ్రీ తప్ప మరొకడు లేడు. ఈ ముగ్గురిలో మూడోవాడు శ్రీరంగం శ్రీనివాసరావు. వేమనమీదా, గురజాడ మీదా వారి సమకాలికులు చేసిన దాడుల గురించి మనకు ఎలాంటి సాక్ష్యాధారాలూ లేవు. ఒక్క శ్రీశ్రీ మీద జరిగిన దాడి గురించి ఎన్నో వివరాలున్నాయి. వాటిలో ఈ పుస్తకం చాలా ముఖ్యమైనది.