''కాంతులు వెలిగ్రక్కు విలువ గల మణులెన్నో, చీకటిచిమ్ము సముద్ర గర్భమున దాగియున్నవి. సౌందర్యమయిన కాలవాలమగు కుసుమములెన్నో నట్టడవి యందు నిరర్థకముగ నేల వ్రాలుచున్నవి...'' అని ఆంగ్లకవి థామస్‌ గ్రే అనినట్లు ప్రతిభావంతులెందరో గలరు. వారు తమ కార్యాలను లోకానికి చాటాలనే చేయరు. వారు లోక క్షేమం నిమిత్తమే కృషి చేతురు.

    ఆ శ్రేణికి చేరినవారు డాక్టరు కృష్ణ.

    ఆంధ్రదేశమున అనేక కవులు, గాయకులు, పండితులు ప్రభవించిరి. కాని, డాక్టరు కృష్ణ వంటి ప్రతిభావంతుడు ఆంధ్రభూమిలో అరుదు. ఆంధ్రదేశములోనే కాదు, ఈ విశాల భరతఖండమున కూడ అరుదే. ప్రపంచములో అటువంటి మేధావులు వ్రేళ్ళమీద లెక్క పెట్ట తగిన వారుగా వుందురు.

    అటువంటి ప్రతిభావంతుని ఆంధ్రులు ఎరుగరు. ఆయనను ఎరిగిన వారు కొద్దిమంది. ఆయన ప్రతిభా సామర్థ్యాలను గుర్తించిన వారు అంతకంటే అల్పం.

    ఆ మహనీయుని గురించి కొద్దిగా తెలుప ప్రయత్నం.

    ఆయన పూర్తి పేరు కాట్రగడ్డ బాలకృష్ణ. స్వగ్రామం గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా, ఇంటూరు. జననం 1898. తల్లిదండ్రులు కోటయ్య, లక్ష్మీదేవమ్మ....

    ఈనాడు కుల నిర్మూలన కోసం పాటుపడుతున్న దళిత ఉద్యమానికి కావాల్సిన చారిత్రక అవగాహనను డా|| కృష్ణ రచన అందిస్తుంది. కుల సమస్య తీవ్రతను గుర్తించిన స్వాతంత్య్ర సమరయోధుల్లో, మార్క్సిస్టు మేధావుల్లో డా|| కృష్ణ ప్రధముడు. ''భారతదేశం ఒక జాతా?'' అనే వ్యాసంలో కులవ్యవస్థ గురించి రాస్తూ ''కులం అనేది హిందువుకు దాదాపు ఒక సహజాతం'' వంటిదని గిల్‌క్రెస్టు అభిప్రాయాన్ని డా|| కృష్ణ ప్రత్యేకంగా పేర్కొంటారు. డా|| అంబేద్కర్‌ కూడా హిందువులలోని కులతత్వాన్ని గురించి ఇంత తీవ్రంగా భావించలేదు. ''హిందువులలో కులం అనేది ఒక భావన. ఒక విశ్వాసం.ఒక మన:స్థితి'' అన్నారు. ఈ ఇద్దరు మేధావులు కులవ్వయస్థను కేవలం భౌతికమైన అడ్డంకిగా మాత్రమే భావించలేదు. అదొక మానసికాంశంగా, అంతకంటే బలమైందిగా భావించారు. వీరిద్దరి అభిప్రాయాల్ని లోతుగా అధ్యయనం చేసినప్పుడు మాత్రమే కులం అనే సామాజిక, మానసిక రుగ్మతను నిర్మూలించగలం.....

Write a review

Note: HTML is not translated!
Bad           Good