రాహుల్జీ మహాపండితుడే గాక ''త్రిపీఠికాచార్యుడు''-మార్క్సిస్టు మేధావి, స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కార్యకర్త. పలుమార్లు జైలుకెళ్ళాడు. తన జైలు జీవిత కాలంలోనే రచనా వ్యాసాంగానికి ప్రణాళిక వేసుకున్నాడు. ఆ తర్వాత రైతుసంఘ నిర్మాణంలోనూ, పోరాటాల్లోనూ పాల్గొంటూనే గ్రంథరచనకు పూనుకొన్నాడు. తన జైలు జీవిత కాలంలో తోటి కామ్రేడ్స్‌కు పాఠాలు చెప్పేవారు.

భారతదేశంలోని మార్క్సిస్టు మేధావులను ప్రత్యేకించి ఉత్తర భారతంలోని మేధావులను ఆయన తాత్విక చింతన ప్రభావితం చేసింది. స్వీయానుభవం, స్వీయపరిశీలన, అధ్యయన ప్రాతిపదికగా ఆయన రచనలు సాగాయి. మార్క్సిస్టు గతితర్కాన్ని ఆయన ఆలోచనలకు అనుగుణంగా భారతదేశ చరిత్రకు, తాత్విక ధోరణులకు అనువర్తింపచేశాడు.

''మానవజాతి ప్రగతిపథంవైపు సాగించిన ప్రతి అడుగూ రక్తతర్పణంతోనే సాగింది. నర రక్తం ఇంతగా ప్రవహించడానికి అన్ని మతాల ధర్మాచార్యులే కారణం; వారే బాధ్యులు. ఏ ఒక్క మతము, ఏ ఒక్క మతాచార్యుడు గర్వించవల్సింది ఏమీలేదు'' అని చారిత్రక ఆధారాల రీత్యా తన రచనల ద్వారా ఆయన ఋజువు చేశాడు. - గడ్డం కోటేశ్వరరావు

పేజీలు :255

Write a review

Note: HTML is not translated!
Bad           Good