మహౄశయుల్లారా, ఇది మీ భాగస్వామ్య నాటిక.
ఇది మీ భాగస్వామ్యం కోరుతుంది.
ఏ సాహిత్యమైనా, సర్వకాలాలకు, సర్వదేశాలకు, సర్వప్రజాళికి దర్పణమన్నమాట, మీ కిష్టమైతే సంతోషమేకానీ, ఈ నాటిక మాత్రం ఈ కాలానికి, ఈ దేశానికి, ఈ జనానికి అద్దం పడుతుంది.
ఇది ప్రతినిత్యం భారతదేశమంతటా చైతన్యవంతులైన దళితుల మీద జరుగుతున్న హత్యలకు ప్రతీకాక్షరరూపం.
దళితులు ఆహుతి అవుతూనే ఉండరాదు. వీళ్ళలో ప్రతీకారవాంఛ ప్రబలకుండ చూడవలసిన బాధ్యత భారతీయులది.
సహృదయులారా, సంపన్నులు, ఆపన్నులు, సవర్ణులు, అవర్ణులు అన్నదమ్ములయ్యే వేకువను సృష్టించండి.
ఆలోచనపరుల చేతుల్లో, చేతల్లో దేశసమగ్రత, సమైక్యత ఉంటాయని నిరూపించండి.
వర్తమాన దర్శకులు మీరు. భవిష్యత్ నిర్మాతలు మీరు. మానవత్వం పొదిగే పాత్రలు మీరు. ప్రేక్షకులు నడిపే నాటిక ఇది. ఎలా జీవితాలను మీరు బాగు చేస్తారో చూపండి.
భవిష్యత్తును శాసించండి.
రండి! రంగస్థలం మీదే!
నాటి వేదన, నేటి సందేశంగా అందించండి!
అదిగో భవిష్యత్తుకు తెరతీస్తుంది!
పేజీలు : 46