మహాకవి శ్రీశ్రీ దిగంబర కవిత్వ తుపానును ఆహ్వానించాడు, అభినందించాడు. ఆశీర్వదించాడు. దిగంబర కవులను 'ఆక్సిజనులు' అంటూ అభివర్ణించాడు, అభినందించాడు. దిగంబర కవులపై అభిప్రాయం అడిగిన వాళ్లందరికీ సమాధానంగా దిగంబర కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించాడు. వివిధ సందర్భాలలో శ్రీశ్రీ దిగంబర కవుల గురించి చెప్పిన విషయాలూ...విశేషాల సమాహారం ఈ పుస్తకం. అందుకే ఇది దిగంబరకవులపై శ్రీశ్రీ సాహిత్య సర్వస్వం.