ఆధ్యాత్మిక ఆదర్శాలను దైనందిన జీవితంలో అందుకోవడానికి సులభసాధ్యమైన ఎనిమిది అంశాల కార్యక్రమం.
ఈ పుస్తకం మీ జీవితాలకు సరిగ్గా సరిపోయే వేదాంత కార్యక్రమ సంచయం. ఉన్నతమైన మతానుచరణకు సరైన సంధానం. ఏకనాథ్ ఈశ్వరన్ గత ముప్పయ్యేళ్లుగా అమెరికాలో ధ్యానం గురించీ దాని ఆచరణ గురించీ బోధిస్తూ వస్తున్నారు. ఆయన సూచిస్తున్న మార్గాలు స్పష్టమైనవి, క్రమబద్దమైనవీ గూడా !
ఏకాగ్రతను పెంచుకోవడం. ఒత్తిడిని తగ్గించుకోవడం. అంతర్గత శక్తులను ప్రోత్సహించడం. కోపాన్ని మంచితనంగా మార్చడం. బాధాకరమైన జ్ఞాపకాలను విడిచిపెట్టి వర్తమానంలో జీవించడం. అర్థం చేసుకోవడం కోసమూ, అవలోకించడం కోసమూ యిది వరకూ ఊహకు అందని శక్తులశ్రీను పెంపొందించడం. ఇది వరకూ సాధ్యం కాదనుకున్న రీతిలో ప్రేమించడం నేర్చుకోవడం. జీవనానికి మీరు చేయగలిగిన సహాయ సహకారాలలేవిటో తెలుసుకోవడం.
పేజీలు : 175