ధ్యానం.
అవును. నిజంగా ఇది ఒక సాగరమే. అద్యంతాలు లేని ఒక మహాసాగరం. ఒక శాంత మహాసముద్రం. కనుమూసినా తెరిచినా అంతర్‌ బహిర్‌ చక్షువులకు గోచరమయ్యే ఒక శాంత గంభీర శరధి!  హృదయమంతా పరచుకుపోయే ఒక శరత్‌ చంద్రికా వీచిక.
అసలు ధ్యానం అంటే ఏమిటి?
''నిశ్చల చిత్తముతో భగవంతుని గూర్చి తలచుట, లేక చింతించుట'' అని మన నిఘంటువు అర్థం చెబుతోంది.
కాని, అసలు అర్థం అది కాదు.
మనోసాగరపు చెలియలికట్టవద్ద- తీవ్రఘోషతో, విరుచుకుపడే ఉత్తుంగభరిత ఆలోచనా తరంగాలతో కల్లోలితమై విలవిలలాడే మనసును -
దూరంగా - కల్లోల రహితమైన పిల్లకెరటాల మధ్య నిశ్చలంగా నిలిచివున్న క్షితిజరేఖ వైపుగా తీసుకువెళ్ళి స్వాంతనపరచే ఒక అద్బుత ప్రక్రియయే ఈ ధ్యానయోగం అని మనం అర్థం చేసుకోవచ్చు.
అసలు 'యోగం' అంటే ఏమిటి?
కలయిక. వీలినం. అవి వస్తువులైనా కావొచ్చు. లేదా భగవంతుడు, భక్తుడు అయినా కావొచ్చు. ఈ యోగంలో రెండు వస్తువులు ఏక వస్తువుగా, రెండు ఆలోచనలు ఒకే ఆలోచనగా లేదా భావంగా రూపొందటం. లేదా ఒక భక్తుడు భగవంతునిలో లీనమై జీవన్ముక్తునిగా తరించటం. అదే ఈ యోగంలో జరిగే అద్భుతప్రక్రియ.....

Write a review

Note: HTML is not translated!
Bad           Good