దిగంబర కవితోద్యమానికి అర్థ శతాబ్ది నిండిన సందర్భంగా లోతైన చూపుతో డా|| జూపల్లి ప్రేమ్‌చంద్‌ రచించిన  గ్రంథం 'ధిక్కారవాదం దిగంబర కవిత్వం'.
    కాలం అతివేగంగా కదిలిపోతోంది. అప్పుడే చూస్తుండగానే, యాభై ఏళ్లు నిండి యాభై ఒకటో సంవత్సరం యిప్పుడు నడుస్తోంది.
    ఈ యాభై సంవత్సరాల్లో దిగంబరులపై దిగంబరుల కవిత్వాలపై విసిరిన రాళ్లూ, పూలూ, వర్షంలో తడిసి, స్పందన, ప్రతి స్పందనలకతీతంగా మారిన క్షణాల్లో యీ గ్రంథాన్ని చదివాను. మనసారా చెబుతున్నాను - యిది నిశ్చితమైన విశ్లేషణలతో కూడిన అరుదైన గ్రంథంగా భావిస్తున్నాను.
    మనిషి కులం కత్తితో, మతం మత్తులో, ఎన్నికల క్రీడలో ముక్కలు ముక్కలుగా నరకబడుతున్నాడు. మనిషి యిప్పుడు కబేళాలో వున్నాడు. అన్ని విలువలు మంటల్లో మాడి మసైపోతున్న బీభత్స సన్నివేశంలో దిగంబర కవితోద్యమంపై యిటువంటి చారిత్రాత్మకమైన గ్రంథాన్ని అందజేస్తున్నందుకు డా|| జూపల్లి ప్రేమ్‌చంద్‌కు ధన్యవాదాలు. - నగ్నముని
Pages : 87

Write a review

Note: HTML is not translated!
Bad           Good