ధమ్మపదం అంటే బుద్ధభగవానుని బోధనలు అని అర్థం చేసుకోవాలి. పదానికి ప్రాచీనకాలంలో వాక్యం అనే అర్థం ఉండేది. అర్థపరిసమాప్తిని కలిగించే శబ్దసముదాయానికి వాక్యం అని పేరు. ఇప్పటి పదాన్ని (Word) ఆ దినాల్లో నామ అనేవారు. అక్షరాలను వ్యంజనములు అనేవారు. ధమ్మపదంలో 423 గాథలు (Verses) ఉన్నాయి. పూర్వకాలంలో గాథకు కూడా వాక్యం అనియే అర్థం ఉండేది.
నలభైఐదేండ్ల సుదీర్ఘ ధర్మచక్ర ప్రవర్తన కాలంలో భగవానుడు ఆయా స్థలాల్లో ఆయా సందర్భాల్లో ఆయా సమయాల్లో ఆయా వ్యక్తులకు బోధించిన భోధనల సంకలనమే ఈ ధమ్మపదం. చెల్లాచెదరుగా ఉండినట్టి ఈ భోధనలను సేకరించి వాటికి గాథారుపం (Verse form) ఇచ్చి ఆ గాథలను 26 వర్గాలుగా విభజించి గ్రంథంగా కూర్చడం జరిగింది. ప్రథమ సంగీతిలో పాల్గొన్న అర్హతులు ఎవరో ఈ మహత్తర కార్యాన్ని సాధించినారు. ప్రథమ సంగీతికారులు ఆ గ్రంథాన్ని బుద్ధవచనంగా ఆమోదించి ఖుద్దకనికాయంలో (minor collections) చేర్చినారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good