ఏ కథానిక అయినా జీవిత చిత్రణే. ఊహాత్మక జీవిత చిత్రణ కాక రచయిత అనుభవ పరిధిలోకి వచ్చే జీవిత చిత్రణలో విశ్వసనీయత ఎక్కువ. స్థలకాలాలు, వాటి మూలంగా అమిరే వాతావరణంలో పాఠకుడు సులభంగా మమేకమవుతాడు.
...
దేవులపల్లి కృష్ణమూర్తి గారివి తీగలు సాగి పందిరిని అల్లుకుంటున్న కథానికలు. దేశీయమైన వాతావరణంలో సహజమైన సన్నివేశాల మధ్య, సంభావ్యత పుష్కలంగా వున్న సంఘటనలతో ఈ కథానికల్ని వారు సృష్టించారు. 'సృష్టించారు' అనేకంటే సమకాలీన జీవితాన్ని చూస్తూ, దాన్ని 'చిత్రించార'ంటే బాగుంటుంది.
అందుకే ఈ కథానికల్లో ఒక మట్టి వాసనతో కూడిన మోటుదనం కనిపిస్తుంది. రచయిత వీటిని కళాత్మకం చేయటానికి ప్రయత్నించలేదు. తనకు తెలిసిన మనుషులే వీటిల్లో పాత్రలు. పేరు మార్చుకుని కనిపిస్తారనిపిస్తుంది. వాళ్లలో కథకుడు కలిసిపోతాడు. వాళ్ల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాడు. ఈ మేరకు కొంత ఆత్మకథాత్మకత చోటుచేసుకుంది.

ఇవి - మన పక్కింట్లోనో, ఎదురింట్లోనో జరుగుతున్న అనుభూతి పాఠకునికి కలుగుతుందే తప్ప, ఊహాలోకంలోంచి ఊడిపడ్డట్టుగా వుండవు. ఇట్లాంటి కథానికలు తెలంగాణాలో 1950కి ముందు వచ్చాయి. అయితే వాటి మీద అప్పట్లో విమర్శ, విశ్లేషణ అంతగా రాలేదు.

ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ జీవన చిత్రణ పట్ల రచయితలలో చైతన్యం పెరిగిందనటానికి 'తారుమారు' కథానికలు ఒక సాక్ష్యం.
(డా. అమ్మంగి వేణుగోపాల్‌ ఈ పుస్తకానికి రాసిన ముందుమాట నుంచి)

Write a review

Note: HTML is not translated!
Bad           Good