Rs.210.00
In Stock
-
+
ఏదైతే తరచూ జరుగుతూంటుందో అది మనకి సహజంగా కనిపిస్తూంటుంది. అరుదుగా జరిగినా దేనికైతే వివరణ ఉంటుందో, దాన్ని సహజంగానే భావిస్తాం. ఉదాహరణకి సంపూర్ణ సూర్యగ్రహణం. ఏదైతే అత్యంత అరుదుగా జరిగి దానికి వివరణ దొరకదో దాన్ని మనం అద్భుతంగా, అపూర్వంగా భావిస్తాం.
ఇలాంటి అనేక సంఘటనలు ప్రపంచంలో చాలా జరిగాయి. వాటిని మనం కాకతాళీయంఆ కొట్టిపారేయలేం.
కిటికీలు, మరో తలుపు లేని గది లోంచి మనిషి అంతు తెలియకుండా మాయమవడం, ఉరి తీయబడిన వ్యక్తి వేరే వేరే సందర్భాల్లో మూడు సార్లు కనబడడం, శ్రోతలని ఆత్మహత్యకి ప్రేరేపించే పాట...
ఇలా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన 'ఇదెలా సాధ్యం?' అనిపించే సంఘటనల సమాహారమే ''దేవుడికే తెలియాలి!'
పేజీలు : 196