Rs.80.00
In Stock
-
+
ఈ పుస్తకంలో జంతువుల కథలు, మనుషుల కథలూ ఉన్నాయి. జంతు నైజం గల మనుషుల కంటే, మనిషి నైజం గల జంతువుల కథలు చెప్పడం మేలు. ఆధునిక యుగంలో ఆటపాటలకు, అద్భుతమైన కథలకు దూరమవుతున్న పిల్లల చెంతకు వింతల్ని, గిలిగింతల్ని మోసుకెళ్ళి, వారిలో ఊహాశక్తిని, ఉన్నత విలువల్ని పెంచడానికి మనకు ఇలాంటి కథలు కావాలి. ఇవి కేవలం పిల్లలకు మాత్రమే కాదు. పెద్దలు కూడా చదివి, నేర్చుకోవాల్సినంత విలువైనవి. మానవత్వం వైపు మళ్ళించగల శక్తి గలవి. విలువలు నశించిపోతూ, నిజాయితీ కృశించిపోతూ డబ్బుకూ సంపదకూ తప్ప, మానవీయ విలువలకు చోటు లేకుండా పోతున్న ఈ తరునంలో జ్ఞానపథానికి దారులు వేసే జానపద కథా ప్రతిబింబాలు ఈ సంపుటిలో అందిస్తున్నాం. ఇవి ఈ తరం బాలబాలికలకు, యువకులకు వ్యక్తిత్వ వికాస దిశగా దిశా నిర్దేశం చేయగలవన్న ప్రగాఢ విశ్వాసం మాకుంది.
పేజీలు : 84