1975 జులై 25వ తేది అర్థరాత్రి ఈ దేశచరిత్రలో ఒక శాపగ్రస్తమైన కరాళ రాత్త్రై, పందొమ్మిడి నెలలపాటు చిమ్మచీకట్లు ప్రసరించింది. స్వేచ్ఛకు సంకెళ్లు, కలాలకు కళ్లేలు, భావాలకు బంధాలు వేసింది. దేశం ఒక రాజకీయ స్మశానమయింది. రాజకీయనాయకులేకాదు, రచయితలు, కవులు, భావుకులు, పత్రికా రచయితలు - అందరూ ఎందరో కారాగారాల పాలయ్యారు.

తెలుగుదేశంలో ఎమర్జెన్సీ దమననీతికి గురైన రచయితల్లో ప్రముఖుడు కె.వి.రమణారెడ్డి. ఆయన్ను పందొమ్మిది నెలలు నెల్లూరు జైలులోను, సికింద్రాబాదు సెంట్రల్‌ జైల్లోను నిర్బంధించారు. ఆయన జైలు జీవితం ఫలితం ఈ పుస్తకం. తెలుగులో ఇది తొలి ప్రయోగం. ఇది వ్యక్తిగతమైన దినచర్యకాదు; దేశ రాజకీయ సాంఘిక పరిస్థితులమీద, అనేకానేక సమకాలీన సంఘటనలపైన ఇదొక గచ్ఛద్వ్యాఖ్య. ఎన్నో పుస్తకాలమీద, సాహిత్య ధోరణులమీద, సాహిత్యకారుల ధోరణుల మీద ఇదొక సీమీక్షా గ్రంథం.

Pages : 340

Write a review

Note: HTML is not translated!
Bad           Good