మన సమాజంలో రెండు విభిన్న ప్రపంచాలున్నాయి. ఒకటి - అన్నీ ఎక్కువై కళ్లు నెత్తికెక్కిన విశిష్ట జనాలున్నది. రెండు - అన్నీ తక్కువై అథ:పాతాళానికి కృంగిపోయిన పీడిత జనాలున్నది. ఈ రెంటికీ చెందని మధ్యతరగతి వేరే ఉన్నా, ఆ జనాలకి వేరే ప్రపంచం లేదు. ఈ రెండు ప్రపంచాలతోనే కలిసి జీవిస్తూ సద్దుకుపోవాల్సి ఉంది. విశిష్టుల్లో కొందరు ఈ రెండు ప్రపంచాల్ని శాసించే పాలకులౌతారు. ఆ కొందర్నీ ఎన్నుకునేది పీడిత జనాలందరూ. పాలకులు అయోగ్యులైతే, చేసుకున్న పీడితులకి చేసుకున్నంత మహాదేవ అని సరిపెట్టుకోవచ్చు. కానీ- పాపం, ఆ విషయంలో ఏ ప్రమేయమూ లేని మధ్యతరగతి జనాలకేమో, చేసుకోనివారికి చేసుకోనంత మహాదేవ.

ఆ రెండు ప్రపంచాల అంతరాన్ని తొలగించడం పాలకుల కర్తవ్యం. కానీ తొలగించరు. ఆకలి, అజ్ఞానం, అథ:పాతాళం - పీడితుల్లో ఆవేశం, కసి, కోపం, ద్వేషం నింపుతాయి. పాలకులు తమకి అందరు కాబట్టి, పీడితులవి తమకి అందుబాటులో ఉన్న మధ్యతరగతిపై చూపిస్తారు. మన చుట్టూ జరిగే నేరాలు చాలావరకు అలాంటివే!

ఈ భూమ్మీద జీవులకి అనుకూలమైన వాతావరణం ఉన్నట్లే, మన సమాజంలో ప్రోత్సహించే వాతావరణముంది. మనకి ఉన్న చట్టాలేమో - నేరస్థుల్ని శిక్షించడమే నేరాల్ని అరికట్టడమనుకుంటాయి. మన సమాజంలో ఉన్న రెండు ప్రపంచాలకీ ఉన్న అంతరం కొంతయినా తగ్గేదాకా, మనమీ పద్ధతి మార్చాలి. నేరాల్ని అరికట్టడం మనకి ప్రధానం కావాలి. నేరస్థుణ్ణి సంస్కరించి మనిషిని చెయ్యడానికి ప్రయత్నించాలి.

అలా స్ఫురించిన పాత్ర డిటెక్టివ్‌ వెంకన్న. కల్పిత పాత్ర వెంకన్న ఆశయాన్ని - ఎప్పట్నించోనూ ఇప్పటికీనూ ఆచరణలో చూపుతున్న, చూపిన సంస్కర్తలు మన సమాజంలో చాలామందే ఉన్నారు.

ఈ 'డిటెక్టివ్‌ వెంకన్న కథలు'లో నేరస్థుడికి సన్మానం, (అ)పరాజిత, వెల్లుల్లి వాసన, దిండులోని డబ్బు,ర 72 వేల నగ, ధనదాహం, దొంగకు సన్మానం, క్లూ, నీతి-నిజాయితీ, వీడని జంట, వెన్నెల విలువ, దేవుడు వరమిచ్చినా అనే కథలున్నాయి.

Pages : 156

Write a review

Note: HTML is not translated!
Bad           Good