తమకు ఇష్టమైన పాటను ఏదో ఒక సందర్భంలోనైనా , ఒంటరిగానైన పాదుకొని ఆనందించని మనిషంటూ ఎవ్వరూ వుండరు. అప్పటివరకూ శ్రమను తగ్గించడానికి జానపదం పాడుకొన్న సామాన్య జనం సైతం సమాజంలో వినిపిస్తున్న దేశభక్తి గీతాలను పాడుకుని తమ భక్తిని చాటారు. కోటితెనేతీగల మకరందం ఉన్న ఈ పాటలు విన్నవారందరికి హృదయం ఉప్పొంగిపోతుంది పౌరుషం ప్రజ్వరిల్లుతుంది. దేశ స్వాతంత్య కోసం పోరాడిన వీరులకు నేరుగా నిటారుగా పట్టిన కర్పూర నీరాజనాలు ఈ గీతాలు. బకించంద్రుని వందేమాతరం రవీంద్రుని జనగణమణ , ఇక్బాల్ గారి సారేజహాసె అచ్చా లాంటి గీతాలు దేశసరిహద్దులు దాటాయి. ఇదే వరవడిలో గురజాడ 1910  లోనే దేశభక్తికి కోటా నిర్వచనాన్నిచ్చి అంతర్జాతీయ దృష్టిని మన వైపుకు మరల్చిన దేశమును ప్రేమించుమన్నా లాంటి రచనలు భారతీయ సాహిత్యంలోనే అద్వితీయమని భావించారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good