కన్నయ్య కుమార్ ఓ పరిణతి చెందిన విద్యార్థి నేత. సమాజంలో కొనసాగుతున్న వివక్షలు, అణచివేతలు, దోపిడీల గురించి అవగాహన ఉన్న వ్యక్తి. మతోన్మాద, సామ్రాజ్యవాద ప్రమాదాల గురించి స్పష్టంగా తెలిసిన వ్యక్తి. ఆయన పుట్టి పెరిగిన వాతావరణంతోపాటు, బహుళ అభిప్రాయాలకు తావుకల్పిస్తూ, పురోగామి భావజాలానికి నెలవుగా ఉన్న న్యూఢిల్లీ, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం కన్నయ్య కుమార్ మేధోపరిణామానికి తోడ్పడింది. ఇదే భావజాలంతో ఉన్న ఇతర విద్యార్థి సహచరులతో పాటు కన్నయ్య కుమార్ కార్యకలాపాలు మతోన్మాదులకు, ఇతర ప్రతీప శక్తులకు కంటగింపుగా ఉండటం ఎంత మాత్రం ఆశ్చర్యం కల్గించదు. రెచ్చిపోయిన మతోన్మాద మూకలు కన్నయ్య కుమార్‌పై పదే పదే దాడులకు పాల్పడుతున్నారు. దేశంలోనే కాకుండా, అంతర్జాతీయంగా సైతం ప్రజాస్వామికవాదుల, ప్రగతిశీలుర మద్దతును పొందుతూ, మతోన్మాదుల, ఇతర అభివృద్ధి నిరోధకుల ఆగ్రహానికి కారణమవుతున్న ఈ విద్యార్థి నేతల ప్రసంగాలు, చర్చాగోష్టులు, ఇంటర్వ్యూల సంకలనం 'దేశభక్తి - ప్రజాస్వామ్యం'.
Rs.30.00
In Stock
-
+
Pages : 79