ఇదో సాహిత్య జాతీయ పతాకం

ఉత్తమ సాహిత్యం సామాజిక శాస్త్రాలను మించి ప్రజలను ప్రభావితం చేస్తుంది. అధ్యయన సాధనంగా పనికొస్తుంది. 'దేశభక్తి కథలు' ఈ లక్ష్యాన్ని అక్షరాల నెరవేర్చాయి. ఇవి ఊసుపోక రాసినవి కావు. నైతిక, రాజకీయ, సామాజిక సంఘర్షణ నడుమ జనం విస్మరిస్తున్న దేశం... గాయమై మనసుకు నెప్పి కనిపిస్తుంది. జాతీయభావన అనేది ఓ పార్టీ నినాదంగా మారిన రోజులు ఇవి. ఈ అవగాహన రాహిత్య స్థితి నుంచి జనాన్ని బయట పడేయటానికి ఈ కథలు ఎంతో ఉపకరిస్తాయి. ఎక్కడెక్కడి కథలనో ఏరి ఎంచి మరీ ఎందరెందరో రచయితల దృష్టి కోణాన్ని ఆవిష్కరించారు. ధర్మం - చరిత్ర - అస్తిత్వం - భక్తి - యుద్ధం - రాజకీయం - అన్ని కోణాల మూలాలు కాలాన్ని జయించి కళ్లను కట్టేస్తాయి! కథా వర్గీకరణలో గొప్ప ఔచిత్యాన్ని ప్రదర్శించారు. విశ్వనాథ సత్యనారాయణ నుంచి యండమూరి వీరేంద్రనాథ్‌ వరకూ వేంపల్లి గంగాధర్‌ నుంచి బలభద్రపాత్రుని రమణి వరకూ పలు రచయితల దృష్టికోణాన్ని ఒకే ఒక మైక్రోస్కోప్‌లో అందించిన 'దేశభక్తి కథలు' ఇవి! తెలుగునాట ప్రతి చదువరి దగ్గర వుండి తీరాల్సిన సాహిత్య జాతీయ పతాకం ఇది. - వల్లూరి రాఘవరావు

పేజీలు : 264


Write a review

Note: HTML is not translated!
Bad           Good