డిప్రెషన్ ఇది మనం చాలా సహజంగా ప్రతి చోట వినే మాట నాన్న అరిచాడని, అమ్మతిట్టెస్తుందని , టీచర్ కొట్టేడని, సినిమా టికెట్స్ అందలేదని ఆటలో ఓడిపోయానని , ఎవరైనా కొంచం డల్ గా, ఉదాసీనం గా ఉంటే వీడు డిప్రెషన్ ను గురయ్యాడు రా అని సహచరులు అను కోవటం మన సమాజంలో బహుపరిపాటి మనం తరుచుగా వార్తా పత్రికల్లో మీడియా ద్వారా ఎన్నో ఆత్మహత్యలు ఉదంతాలను వింటున్నాము. చూస్తున్నాము. ఆర్దిక ఇబ్బందులు , దారిద్యం , నిరుద్యోగం, అసంతృప్తి, ఓటరితనం వ్యాధులు , వృద్దాప్యం కుటుంబ సభ్యుల నుండి ప్రేమ  రాహిత్యం ఇలా ఎన్నెన్నో కారణాలు డిప్రెషన్ కు, ఆత్మహత్యలకు గోచరిస్తున్నాయి. కానీ కనిపించని కారణాలు అనువంసికం.. మెదడులోని కొన్ని కెమికల్స్  యొక్క సమతుల్యతలో తేడా రావటం, హోర్మోనల్ ఇంబ్యాలన్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. సమాజంలోని అత్యధిక ఆత్మహత్యలు మానసిక వ్యాధుల వల్లనే కలుగుచున్నవి. అలాగే ఏంతో మంది డిప్రెషన్ కు అద్బుతమైన వైద్య చికిత్స లభిస్తుందని తెలియక నిరాశ . నిసృహ ,బాధ, దుఖం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, సంతోషాన్ని పొందలేకపోవడం, నిత్య వ్యక్తుల మీద విరక్తి మరియు జీవితం పై విరక్తి లాంటి లక్షణాలతో తమ జీవితాన్ని నిరర్ధకంగా బలి చేసుకుంటున్నారు. నా ఈ చిన్న పుస్తకం చదివి ఏ కొంతమంది అయినా తమ జీవితాన్ని సార్ధకత చేసుకుంటే నా  జీవితం చరితార్ధకమైనట్టే.

Write a review

Note: HTML is not translated!
Bad           Good