పెనుగొండ లక్ష్మీనారాయణ అభ్యుదయ రచయితల సంఘంలో ప్రదాన బాధ్యతలో ఉన్నారు. ఆధునిక తెలుగు సాహిత్య పరిణామాలతో సన్నిహితంగా ప్రయాణించినవారు. అభ్యుదయ సాహిత్యోద్యమంలో ఉద్ధండులతో కలిసి స్వయంగా పాల్గొన్నవారు. ప్రజా సాహిత్యం పట్ల, ప్రజా సాహిత్య చరిత్ర పట్ల వాస్తవిక దృష్టి కలిగినవారు. ‘దీపిక’ పేరుతో వెలువరించిన ఈ పుస్తకం వారి సాహితీ అనుభవానికి అద్దం పట్టింది. ఈ పుస్తకంలో పెనుగొండ తెలుగు సాహిత్యంలోని అనేక అంశాలకు సంబంధించి సాధికార సమాచారం ఇచ్చారు. అభ్యుదయ సాహిత్యోద్యమం రథసారధులు రాంభట్ల కృష్ణమూర్తి, సెట్టి ఈశ్వరరావు, ఆవంత్స సోమసుందర్‌, రెంటాల గోపాలకృష్ణ వంటి వారి సాహిత్య కృషిని ఎంతో స్ఫూర్తిమంతంగా పరిచయం చేసారు. సాహిత్య చరిత్రకు సంబంధించి దారితప్పించే ‘తొలి మలితరం తెలుగు కథలు’ సంకలనం గురించి వివరంగా చర్చించి తప్పులకు రుజువులు చూపిస్తూ సరిచేసిన వ్యాసం చాలా విలువైన సమాచారం ఇస్తుంది. పి.వి.నరసింహారావు రసిన ‘గొల్లరామవ్వ’ కథను చారిత్రకాంశాల నేపథ్యంలో విశ్లేషించారు.....

పేజీలు : 256

Write a review

Note: HTML is not translated!
Bad           Good