నిజంగానే అమ్మవారు నిద్రలేచిందా? ఆ మూగజీవాన్ని నరికితే తృప్తిచెంది భవిష్యత్తు చెపుతుందంటావా?'' వద్దు వద్దనుకుంటూనే కనులు తెరిచి ఆ తతంగాన్నంతా చూస్తూ మెల్లిగా అడిగింది వార్షిక.
'అమ్మవారు నిద్రలేవటమా? నీకేమైనా పిచ్చిపట్టిందా?'' ఆమె వైపు తిరుగుతూ అన్నాడు సాంబు.
'మరి ఆ గోల దేనికి ?'
'ఆ గోల లేకపోతే బలి తతంగం రక్తి కట్టేది ఎలా ?'
'అమ్మవారు నిద్రలేవకపోతే బలి ఇవ్వటం దేనికి ?
'బలి ఇస్తేనన్నా నిద్రలేస్తుందేమోనన్న నమ్మకంతో'
అటు తిప్పి ఇటు తిప్పి తను కాదన్న మాటనే అవునని సమర్ధించుకుంటూ ఏ విషయమూ నిర్ధారణగా చెప్పని తన సోదరుడివైపు విచిత్రంగా చూసింది వార్షిక.
'పిచ్చిదానా - ఈ జాతర్లు, బలులు, ఈ గణాచారుల భవిష్యత్‌ వాణులు అన్నీ నామాటల మాదిరిగానే వుంటాయి - కాపుసారాతాగి, ఆ మైకంలో ఇష్టం వచ్చినట్టు ఎగురుతుంది గణాచారిని. నోటికి వచ్చిన మాటల్ని అందరికీ వినిపిస్తుంది. అష్టావధానం, శతావధానం చేసే మహా పండితుల కంటే తెలివైనవాళ్ళు ఈ జాతర్లను నడిపించే పూజారులు. సారామత్తులో గణాచారి పలికిన పలుకులన్నింటికీ చక్కటి అర్ధాన్ని కల్పించి విశదీకరిస్తారు. మంచిని వినటానికే ఉబలాటపడే సగటు మనిషి సైకాలజీ వీళ్ళకు కొట్టిన పిండి. ఒక విధంగా చూస్తే వీళ్ళ కడుపులు నిండటానికే ఏర్పరచారని చెప్పవచ్చు. ఈ జాతరలని' ఆమెకు మాత్రమే వినబడేటట్లు చెవి దగ్గర నోరు పెట్టి చెప్పాడు సాంబు.
''జాతర్లను గురించి ఇన్ని విషయాలు తెలుసుకొని, ఇవన్నీ వట్టి హంబక్‌ అని ఇంత గట్టిగా చెప్పేవాడివి, మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు ఇక్కడికి' వెంటనే ప్రశ్నించింది వార్షిక. అవును ఇదంతా వట్టి ట్రాష్‌ అని నమ్మే సాంబు తెలిసే ఆ జాతరకు ఎందుకు వెళ్ళాడో? 'డెత్‌వారంట్‌' నవల రాసిన మధుబాబుగారే చెప్పాలి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good