విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబుల్‌ బహుమతి గ్రహీత ప్రొఫెసర్‌ ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌కూ, చిన్నారులకూ మధ్య సాగిన లేఖల సంకలనం ఇది. చిన్నారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం ఎంతో కుతూహలమైన, ఆనందదాయకమైన విషయం. అందులోనూ పూర్తిగా తెలిసీతెలియని పరిజ్ఞానంతో వారడిగే యక్షప్రశ్నలకు ఉత్తరం రాయడం కొంత వరకు కష్టమే. అయినా, ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ దాన్నే ఇష్టంగా భావించారు.

దీన్నే తెలుగులోకి అనువదించిన రావెల సాంబశివరావు తెలుగు చిన్నారులకు చిరపరిచితులే. ఈ పుస్తకంలో లేఖలతోపాటు ఐన్‌స్టీన్‌ 'జీవనరేఖలు' శీర్షికన క్రోనాలజీ ఇచ్చారు. అలాగే అరుదైన ఛాయాచిత్రాలు కూడా చోటుచేసుకున్నాయి. వీటిని ఎంతో కష్టపడి సేకరించినట్లు స్పష్టమవుతుంది. ఐన్‌స్టీన్‌ లేఖా స్రవంతి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, శాస్త్రవేత్తలుగా ఎదగబోయే చిన్నారులకు నిజంగా కరదీపికే. - ఇండియా టుడే

ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ మనకు మేధావిగానే తెలుసు. అలాంటి మేథావికి...చదువుల్లోనూ నిత్యజీవితంలోనూ తమకు ఎదురయ్యే వివిధ సందేహాల గురించి చిన్నారులు లేఖలు రాయడం. ఓ గురువులా తాతయ్యలా వాటిని నివృత్తి చేస్తూ ఐన్‌స్టీన్‌ బదులు ఇవ్వడం...చాలా గొప్ప విషయం. వివిధ అంశాలకు సంబంధించి..దాదాపు డెబ్బై ఉత్తరాలు ఉన్నాయీ పుస్తకంలో. ఉత్తరాలతో పాటు, ఐన్‌స్టీన్‌ జీవితంలోని ముఖ్య ఘట్టాలు, అరుదైన ఫోటోలు పుస్తకంలో పొందుపరిచారు. - ఈనాడు

Write a review

Note: HTML is not translated!
Bad           Good