రణభేరి, రణరంగం రెండు అమృతమూర్తులు. 

కాలం కర్పూరం.

వెలుగుతుంది.

కరుగుతుంది.

జీవితాలూ అంతే!

కొన్ని వెలుగుతాయి.

కొన్ని కరుగుతాయి!

వెలిగిన కాలం వ్యక్తికీ, సమాజానికి గుర్తుంటుంది. కరిగిన కాలం కాలగర్భంలో కలుస్తుంది. జాడలు సహితం మిగలవు.

కర్పూరం కరిగినా అంతే!

నేను నిత్యసాహితీ కృషీవలుణ్ణి. అర్థాన్ని కాక అక్షరాన్నీ, ఆవేశాన్నీ నమ్ముకున్నవాణ్ణి! నా జీవితంలో కాలపు కర్పూరపు వెలుగులు జీవనయానం నిండా పరుచుకున్నాయి.

ఇంకా యవ్వనం దాటకముందటి వెలుగులు 'రణభేరి', 'రణరంగం'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good