దాశరథి రంగాచార్య మానస సరోవరంలో విరిసిన వికసిత శతదళశోభిత సువర్ణ కమలం...ఈ మానస కవిత! ఇది భగవంతుడితో సాగించిన సంభాషణ. ఆకాశపు హద్దులు దాటిన మనిషి బుద్ధిని ఓ కంటా, పాతాళపు అంచున చేరిన మానవ హృదయాన్ని మరో కంటా చూస్తూ కర్తవ్యబోధకోసం తెరిచిన జ్ఞాననేత్రం ఈ కవిత్వం. ఇది ఓ విహంగస్వనం.  ఇది ఓ తరంగస్వరం. సిగ్గులేని జనాన్ని నిగ్గదీసి అడిగిన ప్రశ్న ఈ కవిత్వం. సాహిత్యమనే తూరుపు వేదికపై కవిత్వమనే వేకువ నర్తకి చేసిన చైతన్యపు శ్రీకారం హృదయరవళి ఓంకారం దాశరథి మానస కవిత్వం. బయట కనిపించేదంతా తన లోపలి ప్రపంచమేనని, అద్దంలో కనబడేది తన ప్రతిబింబమేనని తెలుసుకోలేక విలవిలలాడుతున్న మనుషుల గుండెపుండుపై పూసిన అక్షర నవనీతం ఈ కవిత్వం. 

రకరకాల ఇజాలతో, వేషాలతో, రోషాలతో, పరిమిత లక్ష్యాలతో సాగుతున్న ప్రచార కవిత్వం కాదు ఇది. ఓ బాధ్యతతో ఓ బాధతో, ఓ వేదనతో భగవంతుడికి నివేదించిన వినతిపత్రం ఇది. - వల్లూరి రాఘవరావు (ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక సంపాదకుడు)

Write a review

Note: HTML is not translated!
Bad           Good