Rs.30.00
In Stock
-
+
కడదాకా ప్రజలకోసమే తన కలాన్ని ఉపయోగించిన ధన్యజీవి డాక్టర్ దాశరధి రంగాచార్యకు నవతెలంగాణా పబ్లిషింగ్ హౌస్ సమర్పిస్తున్న అక్షరాంజలి ఇది. పుట్టింది అగ్రకులంలోనే అయినా కడుపేదరికం అనుభవించిన దాశరధి ఆనాటి పేదల బ్రతుకులను సంపూర్ణంగా అర్థం చేసుకొని వారి కడగండ్లను కళ్లకు కట్టినట్లు తన రచనల్లో ప్రతిబింబించారు. నిజాం నిరంకుశ పాలనలో దేశ్ముఖ్ల, జాగిర్దార్ల క్రూర చర్యలను, పచ్చి ఫ్యూడల్ దోపిడీని ప్రజల భాషలో అక్షరరూపం ఇచ్చి ఆ ప్రజలను మేల్కొలపడానికి తన రచనలను సాధనంగా అందించారు. అలాంటి మహనీయునికి అంజలి ఘటిస్తూ ఈ చిన్న పుస్తకం ప్రచురణ.