తెలుగు భక్తి శతకాలలో కంచెర్లగోపన్న అనే భద్రాచల రామదాసు రచించిన దాశరథీ శతకానికి ఉన్నంత జనాదరణ మరి ఏ శతకానికి లేదు. తెలుగువారి దృష్టిలో దేవుడంటే తిరుపతి వెంకన్న తరువాత స్థానం భద్రాచలరామన్నకే. భక్తుడు అంటే రామదాసే. ఎందరు రామభక్తులున్నా రామదాసు మాత్రం ఒక్కడే. రామదాసు జీవిత చరిత్రను, భక్తిని, రాముని భక్తిలో ఆయనకు గల స్థానాలను తెలుపుతూ రామదాసు చరిత్రమనే పేర ఒక పుస్తకం తెలుగు దేశం అంతటిలోను ప్రచారంలో ఉన్నది. రామదాసు వ్రాసిన కీర్తనలు అన్నింటిని ఒక యాభై సంవత్సరాల క్రిందట వరకు పట్టెవర్థనాల దాసరులు నెమలికుంచెలతోటి, ఇత్తడి చిఱుతలు, సమ్మెలతో, నడుంబిగిచిన పట్టు బట్టలతో నృత్యంచేస్తూ పాటలు పాడుతూ, తీర్థాలలో, పల్లెటూళ్లలో గానంచేసి ప్రజలను అలరిస్తూ ఉండేవారు.

సుమారుగా 1620 ప్రాంతాలలో కావచ్చు ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని భద్రాచలం తాలూకాలోని గ్రామం నేల కొండపల్లిలో నివశిస్తున్న కంచెర్ల లింగన్న, ఆయన భార్య కామమమ్మలకు జన్మించినవాడు ఈకవి. ఈయన అసలు పేరు గోపన్న.

పేజీలు : 77

Write a review

Note: HTML is not translated!
Bad           Good