పరిత్రాణాయ సాధూనామ్‌ వినాశాయ చ దుష్కృతామ్‌ !

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ||

 దశావతారాలు అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే పరమేశ్వరుడు అవతాసరాలు ఎందుకు స్వీకరిస్తాడు, దశావతారాలు అని పది అవతారాలు ఎందుకు విశిష్టతను పొందాయి? అన్న విషయం మీద మనకు ఒక సంగ్రహమైన అవగాహన ఏర్పడుతుంది. తార అన్న మాటకి వ్యతిరేకపదం అవతార. తార అంటే నక్షత్రం కాదు. తార అంటే ముత్యం. ఎంత నైర్మల్యంతో, మలినం లేకుండా శుద్ధమైనదిగా ఉంటుందో అంత శుద్ధమైనది అని ఒక అర్థం. తరింపచేసేది కాబట్టి తార అని రెండవ అర్థం.

 ఈ పుస్తకంలో మత్స్యావతారం, కూర్మావతారం, ఆదివరాహావతారం, నృసింహావతారం, శ్రీవామనావతారం, పరశురామావతారం, శ్రీరామావతారం, బలరామావతారం, శ్రీకృష్ణావతారం, కల్కి అవతారం అనే దశావతారాల వైశిష్ట్యం ప్రవచనాల రూపంలో వివరించబడింది.

Pages : 351

Write a review

Note: HTML is not translated!
Bad           Good