దారులేసిన అక్షరాలు
''విమెన్‌ రైటింగ్‌ ఇన్‌ ఇండియా'' రెండు భాగాలూ చరిత్రను సృష్టించాయి. వలసవాద వాసనలతో జాతీయవాద చట్రం నుంచి రాసిన సాహిత్య చరిత్రని విమర్శనాత్మకంగా పరిశీలించాయి. సాహిత్య చరిత్రలో మరుగునపడ్డ పీడితుల గురించి ఆలోచించే గొప్ప సైద్ధాంతిక దృష్టిని అందించాయి. ఈ పుస్తకాలు ఆఫ్రికన్‌ స్త్రీలూ, దళితులూ, ఇంకా అనేక పీడిత సమూహాలు సాహిత్య చరిత్ర రచనకు పూనుకోవడానికి గొప్ప స్ఫూర్తినిచ్చాయి. తెలుగులో వీటి అవసరం చాలా ఉంది. - కె.సత్యనారాయణ అసోసియేట్‌ ప్రొఫెసర్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కల్చరల్‌ స్టడీస్‌, ఇంగ్లీష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ (ఇఫ్లూ)

భారతీయ స్త్రీల రచనలను తొలిసారిగా ఇంగ్లీషులోకి అనువదించి 1989-91ల లోనే 'అన్వేషి' రెండు భాగాలుగా వెలువరించింది. ఆ సంకలనంలోని రెండో భాగానికి తెచ్చిన తెలుగు అనువాదమే ప్రస్తుత గ్రంథం. సమాజ వికసనంలో తమదైన ముద్ర వేసిన మనదేశపు స్త్రీల భావజాలానికి దర్పణం. పితృస్వామ్య శక్తులతో ఘర్షణ పడుతూనే తమ అస్తిత్వాలను నిరూపించుకున్న ఇరవయ్యవ శతాబ్దికి చెందిన 73 మంది రచయిత్రుల అక్షరాల దారులు మనందరి కోసమే. - విజయ భారతి విశ్రాంత డైరెక్టర్‌, తెలుగు అకాడెమీ

Write a review

Note: HTML is not translated!
Bad           Good