ఈ దేవాలయాలు కర్నాటక రాష్ట్రంలోనివి. మా అబ్బాయి చి.సుధా స్వరూప్, I.O.C లో ఉద్యోగరీత్యా మంగళూరులో నాలుగేళ్ళ ఉన్నాడు. అమెరికాలో ఉన్న మా అబ్బాయిలిద్దరూ, వారి కుటుంబాలు ఇండియా వచ్చినప్పుడు, నేనక్కడికి  వెళ్ళినప్పుడు బాబు స్వరూప్, కోడలు విద్య మాకు  అక్కడున్న విశేషాలన్నీ చూపించారు. దాదాపు ముఖ్య దేవాలయాలన్నీ దగ్గరుండి చూపించారు. ఇంకా ఉన్నాయనుకోండి...  నేను దర్శించిన దేవాలయాలన్నింటినీ సాధ్యమైనంత వివరంగా వర్ణించడం జరిగింది. ఫోటోలు తీయడం, సేకరించడం, వివరాలు నోట్ చేసుకోవడం... ఇంటికి వచ్చాక క్లుప్తంగా వ్రాసుకోవడం... ఇలా జరిగి౦ది ప్రతిసారీ. విజయవాడ రాగానే చూసిన దేవాలయం గురించి ఒక్కొక్కటి వ్యాసంగా రాసి, 'ద్యానమాలిక' పత్రికకు పంపడం, వారూ వెంటనే ప్రచురించడం జరిగింది. తెలుసుకోవాలనుకున్నవారికి సత్కాలక్షేపంగానూ, దర్శించడంలో ఆసక్తి ఉన్నవారికి మార్గదర్శిలాగానూ ఉపకరించవచ్చునని భావిస్తాను.  - వల్లూరుపల్లి లక్ష్మి

Write a review

Note: HTML is not translated!
Bad           Good