పుట్టాక నా తాలూకు మాయను పాతిపెడితే

    ఆప్యాయంగా తనలో కలుపుకున్న ఈ మట్టి బిడ్డను నేను!

    నా తల్లిమట్టి మీదనే ఇవాళ పూచీకత్తు అడుగుతున్నారు?

    ...

    నా తల్లీ తండ్రీ నీరూ నిప్పూ

    ఆఖరుకి నేను కూడా వేరు కాదు - నా ప్రాంతమే

    నువ్వు నా దేహంలో భాగం అయితే

        కవి పక్కన పెట్టే దాన్ని అందరిలా

    కానీ ప్రేమికా!

    నువ్విప్పుడు నా ఆత్మలో భాగానివి

    నా భూమివి..!

    ...

    పాతబస్తీ తరపున

    నిరాహారదీక్ష చేస్తూ నిలబడ్డ చార్మినార్‌

    నాలుగు చేతులతో

        నిరసన వ్యక్తం చేస్తూ చార్మినార్‌..

    ...

    ఈ భూమి మీద నీ పాదమెంతో నా పాదమూ అంతే!

    అయినా కాలు బయట పెట్టడానికి నాకు అవకాశమే లేదు

    అలసిన నా మనసు అనుకోవడానికి ఇక్కడ స్థలం లేదు

    మరో గ్రహం ఏదైనా ఉందేమో వెతుక్కోవాలి!

Write a review

Note: HTML is not translated!
Bad           Good