ఈ ఎనిమిది కథల్లో నాలుగు దండకారణ్య విద్యా వ్యవస్థకు సంబంధించినవే. విద్యార్థులను ఉత్పత్తితో, ప్రకృతితో, ప్రజలతో మమేకం చేసి ప్రజాస్వామిక, సమిష్టి చైతన్యాన్ని, తమ మీద తమకు విశ్వాసాన్ని కలగజేసే విద్యను జనతన సర్కార్‌ అందజేయడం ఈ కథల్లో కనిపిస్తుంది.

అమెరికా అండదండలతో భారత ప్రభుత్వం సైన్యానిన దించి ప్రజల ప్రత్యామ్నాయ ఆలోచనలను, ఆచరణను రూపుమాపడానికి యుద్ధంలోకి దిగింది. అక్కడ ప్రజల కోసం పని చేస్తున్న జనతన సర్కారనే కొత్త శిశువును కాపాడుకోవాల్సిన అవిసరం గురించి భారత ప్రజలేగాక ప్రపంచ ప్రజలు కూడా ఆలోచించాల్సి ఉంది. దానికి అండదండలందించాలని, ఇలాంటి నిర్మాణాత్మకమైన, మన కాలంలో రూపొందుతునన సమాజంలో భాగం కావాలని యుద్ధ రంగంలో నొప్పులతో, గాయాలతో, అనేకానేక పనుల ఒత్తిడిలో ఉండి కూడా సృజనాత్మక సాహిత్యం వారి శక్తిమేరకు రాస్తున్నారు. ఇలాంటి సాహిత్యం తప్పక ప్రపంచ ప్రజలు ఆదరించి చదవాలి.

- అల్లం రాజయ్య

Pages : 136

Write a review

Note: HTML is not translated!
Bad           Good