సమాజంలో, సాహిత్యంలో కొత్తవాదాలు దూసుకువస్తున్నప్పుడు వీటిని పూర్తిగా తిరస్కరించే సంపదాయవాదం ఒకటి కాగా; పాతనించి కొంత సంస్కరించుకుని, కొత్తదానిని విమర్శనాత్మకంగా స్వీకరించేది పరిణామవాదం. పాతని మొత్తంగా తిరస్కరించి, కొత్తవాదాన్ని మాత్రమే బలపరిచేది మౌలికవాదం. ఈ మూడు రకాల ధోరణులూ దళితవాద వివాదాల్లో మనకు కనబడుతున్నాయి. ఏది సరైనది, శాస్త్రీయమైనది అనేది పాఠకులూ, పరిశోధకులూ ఎంచుకోవడానికి అవకాశం కల్పించడమే ఈ ప్రచురణ ముఖ్య ఉద్ధేశ్యం. భిన్నవాదాలను అనుమతించే ప్రజాస్వామిక సంప్రదాయాన్ని కొనసాగించడం ఒక సామాజిక బాధ్యతగా, చారిత్రక కర్తవ్యంగా మేం భావిస్తున్నాం.
ఈ వ్యాసాలు రాసిన రచయితలకూ, వాటిని ప్రచురించిన ఆయా పత్రికాధిపతులకూ, సంపాదకులకూ వీటిని గ్రంథస్థం చేయడానికి అనుమతించిన రచయితలకూ, వ్యాసాలను సేకరించడంలో శ్రమ తీసుకున్న సంకలన కర్త ఎస్.విజయభాస్కర్కూ, వ్యాసాల ఎంపికలో తోడ్పడిన ఎన్.రవికుమార్కీ, గ్రంథం త్వరగా తెమ్మని ప్రోత్సహించిన సాహితీ మిత్రులెందరో... అందరికీ కృతజ్ఞతాభివందనం. - డా|| ఎస్వీ సత్యనారాయణ
Rs.100.00
In Stock
-
+