ధర్మన్న కవికి తెలుగు సమాజంలో, చరిత్రలో, సంస్కృతిలో, సాహిత్య చరిత్రలో దక్కిన చోటు ఏపాటిదీ అంటే అది చాలా చాలా అత్యల్పం అనే చెప్పాలి. అదుగో ఆ అత్యల్పాన్ని తుడిచేసే ప్రయత్నమే సి.వి. ధర్మన్న మీద వెలువరించిన ఈ ''దళిత ఉద్యమ వైతాళికుడు -కుసుమ ధర్మన్న కవీంద్రుడు'' - గ్రంథం. తెలుగు సాహిత్యంలో సి.వి. అన్న రెండక్షరాల పేరుకు ప్రత్యేక పరిచయం అక్కలేదు. అభ్యుదయ సాహిత్యానికి, విప్లవ సాహిత్యానికి మధ్య, దిగంబరుల రాక పూర్వం తెలుగు కవితా రంగంలోని  శూన్యాన్ని తమ రచనల ద్వారా పారదోలి పూర్వరంగాన్ని సిద్ధం చేసిన ఒకరిద్దరు కవులలో మొదటివాడు సి.వి. అభ్యుదయ కవిగా హేతువాదిగా, నాస్తికుడిగా, దళిత కయమితగా సి.వి. చేసిన పదుల సంఖ్యలోని రచనలు అటు తెలుగు సాహిత్యంతోపాటు సమాంతరంగా ఇటు దళిత సాహిత్యాన్నీ ప్రభావితం చేసాయి. ప్రజాసాహిత్య సంఘాల్లో సభ్యత్వం పొందిన సి.వి. శివసాగర్‌ లాగే తనూ అవమానాలు పొంది, విస్మరణకు గురై దళిత జండా భుజానకెత్తుకున్నాడు. విషాద భారతం, కారుచీకటిలో కాంతి రేఖ, పారిస్‌ కమ్యూన్‌, నరబలి, సత్యకామ, జాబాలి వంటి కావ్యాలు సి.వి.ని కవిగా నిరూపిస్తే, వర్ణ వ్యవస్థ, ప్రాచీన భారతంలో చార్వాకం, ఆంధ్రలో సాంఘిక తిరుగుబాటు ఉద్యమం, భారత జాతీయోద్యమ పునరుజ్జీవం - వంటి గ్రంథాలు గొప్ప ఆలోచనాపరుడిగా నిరూపిస్తాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good