అర్ధ శతాబ్ధపు (1900-1950) ఆంధ్ర దళిత ఉద్యమాల చరిత్రను లోతుగా, విమర్శనాత్మకంగా విశ్లేషించిన పుస్తకమిది. ఆంధ్ర చరిత్రలో మరుగున పడి కనిపించని అనేక సామాజిక, సాంస్కృతిక అంశాలను యాగంటి చిన్నారావు నూతన ఆధారాలతో వెలికితీసి ఇందులో పొందుపరిచారు.

అంటరానితనం పేరిట హిందూ సమాజం దళితులపై ప్రదర్శించిన హేయమైన వివక్షనూ, క్రౌర్యాన్నీ, వాటి మూలాలనూ దళితుల సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక అభివృద్ధికి దోహదం చేసిన దళిత విద్య, రాజకీయాలలో దళితుల భాగస్వామ్యం గుర్తింపు కోసం, ఆత్మగౌరవం కోసం దళితులు చేసిన పోరాటాలు, దళితుల ప్రతిఘటనా సాహిత్యం వంటి అనేక అంశాలను ఇందులో లోతుగా పరిశీలించారు.

1932 నాటి గాంధీ ''హరిజనోద్ధరణ'' కార్యక్రమానికంటే ఎంతో ముందే మద్రాస్‌ ప్రెసిడెన్సీలోని ఆంధ్ర ప్రాంతంలోనూ, హైదరాబాద్‌ రాష్ట్రంలోనూ పెల్లుబికిన స్వతంత్ర దళితోద్యమాలను ఇందులో సవివరంగా పేర్కొన్నారు. జాతీయ దళితోద్యమ చరిత్రలో అటుంచి, స్ధానికంగా కూడా సరైన గుర్తింపునకు నోచుకోని ఎందరో తెలుగు దళిత మేధావులు, రచయితలు, నేతల విశిష్ట కృషిని ఇందులో కళ్ళకు కట్టినట్లు వివరించారు.

''దళిత్స్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఐడెంటిటీ'' పేరిట ఆంగ్లంలో వెలువడి ఇప్పటికే దేశవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ పుస్తకాన్ని ప్రతి దళితుడూ విధిగా చదవాల్సిన అవసరం వుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good