దళిత సాహిత్య వాదం రూపొందాక వెలువడ్డ నా కథానికలు వేర్వేరు సంపుటాలలో నుంచి తీసి, ఈ సంకలనం రూపొందించాను.

నా కథానికల్లో స్త్రీ, బహుజన, మానవతా వాద నేపథ్యాలతో చేసిన రచనలున్నాయి.

ఈ సంపుటిలోని కథానికల్లోని వస్తువులు, ఇతివృత్తాలు గుంటూరుకూ, అనంతపురానికీ సంబంధించి ఉన్నాయి.

కథానికలు చాలావరకు వ్యావహారిక భాషగానే ఉన్నప్పటికీ కొన్నింటిలో గుంటూరు ప్రాంతానికి చెందిన, మరికొన్నింటిలో అనంతపురం పరిసరాలకు సంబంధించిన మాండలికం ఉంది. ఈ కథానికల్నీ వ్రాసింది అనంతపురంలోనే!

దళిత దృక్పథంతో ఉన్న కథానికలు ఒక్క చోటకు తేవటంవల్ల విషయ దృష్టితో చదవటానికి, అంచనా వేయటానికి వీలుగా ఉంటుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good