డాక్టర్‌ అంబేద్కర్‌ మేధావి, ఎనలేని ప్రతిభావంతుడు, వక్త, రచయిత, ఆదర్శవాది మాత్రమే కాదు, కార్యదక్షుడు కూడా. విద్యావేత్త మాత్రమే కాదు, రాజ నీతిజ్ఞుడు. ఇంతటి ప్రజ్ఞాప్రాభవాలు ఒకే వ్యక్తిలో పొందుకోవడం అరుదైన విషయం. సాంఘీక జీవనంలో న్యూనతాభావాన్ని పోగొట్టడానికి, సమతాభావాన్ని పెంపొందించడానికి అంబేద్కర్‌ చేసిన అవిరళ కృషి అనిర్వచనీయం. నూతన రిపబ్లిక్‌ రాజ్యాంగ నిర్మాతగా ''అపర మనువు'' బిరుదు పొంది, భారతీయులందరికీ ఒకే సివిల్‌ కోడ్‌ నొకదాన్ని ఏర్పాటు చేయాలన్న ఆదర్శ సూచన చేశాడు. స్వతంత్ర చిత్తవృత్తితో, కార్యదక్షతతో ఆయన సాధించిన విజయాలు పేర్కొనదగినవి.

ఈ గ్రంథంలోని కథానాయకుడు అంబేద్కర్‌ ప్రసిద్ధుడు. మన రాజ్యాంగ నిర్మాతల్లో ప్రముఖుడు. ఆయన ఆశయ సాధనకై మనదేశంలో ఇంకా కృషి జరుగుతూనే ఉంది. సాంఘీక సంస్కరణ ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్న విశిష్ట వ్యక్తిత్వము గల మేధావి భావాలను, ప్రభావాలను ప్రతిభావంతంగా మనముందు వుంచారు శ్రీరామమూర్తి, సత్యనారాయణగార్లు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good